రాణి బావి
ఆరోజు శనివారం టైం రాత్రి 11.40 అవుతుంది.
"ఫంక్షన్ అయిపోయింది రవి, అందరు వెళ్లిపోయారు, pickup చేస్కుంటావా ?" అని గంట ముందు ప్రతిమ నుండి వచ్చిన వాట్సాప్ మెసేజ్ ని అపుడే చూసాడు రవి.
అదే రోజున ప్రతిమ మెడికల్ కాన్ఫరెన్స్ కోసం ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది. ఆ విషయం గుర్తుకి రాగానే laptop ని ప్రక్కన పెట్టి "వస్తున్నాను అని ప్రతిమకి రిప్లై ఇచ్చి" హడావిడిగా కార్ బైటికి తీసాడు.
.. .. .. .. .. .. .. ..
ప్రాజెక్ట్ గో లైవ్ దగ్గర్లో ఉండటం తో వీకెండ్స్ కూడా వర్క్ చేస్తున్నాడు. మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ అది, ఆర్కిటెక్ట్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత చేస్తున్న మొదటి ప్రాజెక్ట్. గో లైవ్ కి ముందు ఎటువంటి ఇష్యూస్ రాకూడదని క్రిటికల్ ఫంక్షనాలిటీస్ అన్ని తనే కోడ్ చేస్తున్నాడు.
భరద్వాజ బాబాయ్ ఆర్మీ నుండి రిటైర్ అయ్యాక ప్రకృతికీ దగ్గరగా ఉండాలని వాళ్ళ అమ్మ గారి ఊరైన బసాపురం లో ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. కాశ్మీర్ బోర్డర్ లో ఉద్రిక్తతల వల్ల రవి, ప్రతిమల పెళ్ళికి రాలేక పోయారు బాబాయ్. రిటైర్ అయి బసాపురం వచ్చాక క్రొత్త ఇంటి పని మొదలు పెట్టారు,ఈ మధ్యలో పిన్నికి పక్షవాతమొచ్చింది. కేరళ లో మంచి ఆయుర్వేద డాక్టర్ ఉన్నారని ఎవరో చెబితే బాబాయ్ ,పిన్ని ఇద్దరు 3 నెలలు అక్కడే ఉంది ట్రీట్మెంట్ తీసుకున్నారు . పిన్నికి ఆరోగ్యం బాగై వచ్చేసరికి క్రొత్త ఇంటి పని కూడా పూర్తయింది. క్రొత్త ఇంటికి షిఫ్ట్ అయి మొదటిసారి చేస్తున్న సత్యనారాయణ వ్రతం కోడలి పిల్ల చేతుల మీదుగా చేయిస్తే బాగుంటుంది అనుకుని రవి ప్రతిమలను ఆహ్వానించారు శైలజ పిన్ని భరద్వాజ బాబాయ్. శైలజ పిన్ని,ప్రతిమ డైరెక్ట్ గ కలవకున్న, పెళ్లైన దగ్గర్నుండి ఫోన్లో వీడియో కాల్స్ చేస్కునే వాళ్ళు. ప్రతిమ, పిన్ని ఇద్దరు మాట్లాడుకోవడం ఎవరైనా తెలియని వాళ్ళు వింటే తల్లీకూతురులు మాట్లాడుకుంటున్నారు అనుకుంటారు. అంత బాగా కలిసిపోయారు ఇద్దరు . ప్రతిమ వ్రతానికి ఒక రోజు ముందే వెళ్లి, కావాల్సిన ఏర్పాట్లు అన్ని తనే చేసింది పిన్ని సహాయం తో . వ్రతం శుక్రవారం సాయంత్రమే అయిపోయిన, వేరే ఊర్ల నుండి వచ్చిన గెస్ట్స్ ఆ రాత్రే అక్కడే ఉండి తర్వాతి రోజు వెళ్లిపోయారు . వాళ్ళందరిని చూస్కోవాలిసి ఉంటుంది, పిన్ని ఒక్కతే మేనేజ్ చేసుకోలేదని ప్రతిమ వ్రతం జరిగిన తర్వాతి రోజు వరకు అక్కడే ఉండిపోయింది. కాన్ఫరెన్స్ కోసం ఆరెంజిమెంట్స్ అన్ని వ్రతంకి రెండు రోజుల ముందే చేసుకుంది.
.. .. .. .. .. .. .. ..
ఫ్లైట్ కి లేట్ అవుతుంది అని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు రవి.
టైం 12.20..
కార్ హైవే నుండి బసాపురం వెళ్లే సర్వీస్ రోడ్ వైపుకి తిరిగింది, సడన్ గా కార్ ఎడమ వైపు హెడ్లైట్ ఆఫ్ అయిపోయింది. కుడివైపు హెడ్లైట్ మాత్రం బ్లింక్ బ్లింక్ మంటూ క్రొద్దిగా వెలుగునిస్తుంది. కార్ సర్వీసింగ్ కి ఇచ్చి చాల రోజులయ్యింది కదా , రోడ్డు కుదుపుల వాళ్ళ సర్క్యూట్ కనెక్షన్స్ లూస్ అయినట్టున్నాయి ఒకసారి దిగి చూద్దాం అని కార్ స్లో చేయబోతు, అయిన ఇపుడు ఇది బాగు చేస్కుంటూ కూచుంటే ప్రతిమకి లేట్ అవుతుందని కార్ ఆక్సిలరేటర్ తొక్కాడు.
సర్వీస్ రోడ్ నుండి కొద్దీ దూరం వెళ్ళగానే, రెండు మలుపులు వచ్చాయి. బసాపురం వెళ్ళడానికి ఎటు వైపు వెళ్లాలో అర్థంకాకా, కార్ ని రోడ్ కి ఒకవైపు ఆపి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేద్దామని, ఫోన్ బైటికి తీసాడు. అప్పటిదాకా అమెజాన్ మ్యూజిక్ లో స్ట్రీమ్ అవుతున్న రెహమాన్ సాంగ్స్ ఎందుకు ఆగిపోయాయో అర్థమైయింది రవికి, ఫోన్లో సిగ్నల్ లేదు.
సెల్యులార్ కంపెనీ ఓనర్ ని మనసులో తిట్టుకుంటూ కారు బైటికి దిగి చుట్టూ చూసాడు. ప్రపంచమంతా కాటుక పులుముకుందా అన్నట్లు ఎటువైపు చుసిన చీకటి అలుముకుని ఉంది. అంతసేపు కారు లోపల ఉండటం వాళ్ళ బైట ఎంత చలిగా ఉందొ తెలియలేదు రవికి, ఫిబ్రవరి నెలలో అర్థరాత్రుళ్లు వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. జేబు నుండి గోల్డ్ ఫ్లాక్ సిగరెట్ తీసి లైటర్ కోసం వెతుకుతున్నాడు..
ఇంతలోనే రోడ్ పక్కన ఉన్న తాటాకు చెట్ల చప్పుడు ఎక్కువయ్యింది. బసాపురం కొండల మధ్య ఉండటం వలన, అపుడపుడు కొండగాలికి తాటాకు చెట్ల చప్పుడు ఎక్కువగా ఉంటుంది.. రవి తాటి చెట్ల వైపు ఒకసారి చూసాడు.. కంటికి కనిపించనంత దూరం లో ఒక చిన్న వెలుగు కనపడింది. లైట్ కనిపించగానే బసాపురానికి ఇదే దారి అయుండొచ్చు, ఇంకా లేట్ చేయకూడదు అని సిగరేట్ని అక్కడే పడేసి కారు స్టార్ట్ చేసాడు.
ట్రాక్టర్లు తిరగడం వలన ఏమో రోడ్ రెండువైపులా కొద్దిగా కృంగిపోయి మధ్యలో మాత్రం మాములుగా ఉంది. రోడ్ ఎగుడుదిగుడ్లు కార్ క్రింది భాగాన్ని తగులుతాయేమో అని మెల్లిగా వెళ్తున్నాడు.
500మీటర్లు ముందుకి వెళ్ళగానే హఠాత్తుగా రెండు కుడి చేతులు కార్ ఆపమని ఊగుతూ కనపడ్డాయి రవికి.
ఒక చేతికి ఎర్రటి గాజులున్నాయి.
కొద్దిగా దగ్గరగా వెళ్లి కార్ ఆపాడు రవి. ఇద్దరు మధ్య వయసు వాళ్ళు కనపడ్డారు. చూడగానే వాళ్లిద్దరూ భార్య భర్తలు అనుకున్నాడు రవి.
ఇంత అర్థరాత్రి ఇక్కడేమి చేస్తున్నారో వీళ్ళు అనుకుంటూ కారు అద్దాన్ని కిందకి దించాడు.
ఓ పాపోడా మమ్మల్ని కొంచెం ఊరి దగ్గర దించుతావా? చలికి నడవలేకపోతున్నాము అన్నది ఆడ మనిషి.
ఆమె చీర, వేసుకున్న నగలు, అలంకరణలు చూసి కొంచెం సందేహం వచ్చింది రవికి . మళ్ళి తానే ఏదైనా శుభకార్యానికి వెళ్లి వస్తున్నారేమో అనుకున్నాడు మనసులో.
ఎక్కండి పెద్దమ్మ దించుతాను అన్నాడు రవి.
అప్పటివరకు హోరుమంటున్న తాటాకు చప్పుడు ఒక్కసారిగా ఆగిపోయింది. చెవులు భరించలేనంత నిశ్శబ్దం ఒక్కసారిగా ఆవహించింది. అంతచలిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడిక్కింది. ఎర్ర చందనం చెట్లని కాల్చినప్పుడు వస్తున్నా సువాసన గుప్పుమని వస్తుంది.
రవి ఇదంతా గమనించలేదు. గమనించి ఉండుంటే కథ వేరేలాగా ఉండేదేమో.
భార్యాభర్తలిద్దరూ కార్ ఎక్కి కూచున్నారు.
రవి కార్ స్టార్ట్ చేసి వెళ్తున్నాడు, ఇపుడు రెండో హెడ్ లైటు కూడా ఆగిపోయింది, రవి కి రోడ్ అసలే కనిపించడం లేదిప్పుడు. ఇది గమనించినవాడిలా, పక్కనున్న పెద్దాయన ఇలా అన్నాడు. పాపోడా బండి ఆపకు, దారి నేను చెబుతాలే నువ్వు స్టీరుంగు నేను చెప్పినట్లు తిప్పుతాండు చాలు. నా చిన్నప్పటి సంధి ఈ తొవలోనే తిరుగుతాండ, నువ్వు పోనీ అన్నాడు.
రవికి కూడా వేరే దారి లేక, పెద్దాయన చెప్పినట్లే కార్ డ్రైవ్ చేస్తున్నాడు. కార్ అక్కడి ఆపి ఆ చీకట్లో ఎక్కడికని పోగలడు, ఎంత దూరమని పోగలడు. ఎవరికైనా ఫోన్ చేసి రమ్మందామంటే ఫోన్లో సిగ్నల్ లేదు.
దారిమధ్యలో రవి ఇలా అడిగాడు..అవును పెద్దమ్మ ఇంత రాత్రి మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు ?
పొలానికి మడక కడదాం అని వచ్చినం పాపోడా .. ఈ మనిషి ఇవరం తేలిక డిజలు తక్కువ తెచ్చినాడు, నీళ్ల మోటారు మధ్యలోనే ఆగిపోయా.. మళ్ళా ఊరికి పోయి డిజలు తెచ్చి మడక కట్టేసరికి ఇదో ఇంతసేపాయె. 20 ఏళ్ళ సంధి మడక కడుతున్నాడు ఎపుడు ఎదోక పంచాయతీ చేస్తాడు ఈ మనిషి..
రవి రోబోట్ లాగా చేతులు అటు ఇటు తిప్పకుండా మెల్లిగా పొనిస్తున్నాడు..
పాపోడా నిన్ను ఎపుడు సూడలేదే ఈ చుట్టుపక్కల ఎవరి తాలూకానో? అడిగింది పెద్దమ్మ ..
(ఎవరు చేసుకున్న అదృష్టమో.. ఆ ప్రశ్నకి రవి చెప్పిన సమాధానం అతని ఆయుష్షు చీకట్లో కలిసిపోకుండా కాపాడింది.)
మేము పసుపులేటోళ్ళం పెద్దమ్మ.. రాధమ్మ మనవడిని.. మా భరద్వాజ బాబాయ్ ఇంటికి వెళ్తున్నాను..
.. .. .. .. .. .. .. ..
పసుపులేటి రధమ్మా న .. ఏదో గొణుక్కుంటున్నట్టు చెప్పారిద్దరు .. ..
.. .. .. .. .. .. .. ..
పాపోడా బండి ఎడమవైపుకు తిప్పు.. అరిచినంత పని చేసాడు పెద్దయన.
.. .. ..
ఆ అరుపుకి ఒక్కసారిగా భయపడి కారు ఎడమవైపుకు తిప్పాడు రవి.
ఏమైంది పెద్దయన ఆలా అరిచేసావ్..
ఏంలేదులే పాపోడా .. ముందర రోడ్డు లేదు. మీ పెద్దమ్మ మాటల్లో పడి నీకు దారి చెప్పడంలో alshyam అయింది.
పాపోడా బండి ఆపు. మేము దిగాల్సిన చోటువచ్చేసింది, ఇక్కన్నుండి నువ్వు నేరుగా ఆమడ దూరం ముందుకి వెళ్తే ఊర్లోకి వెళ్లే సిమెంటు రోడ్ కనపడుతుంది.
ఎక్కడుంది పెద్దాయన మీ ఇల్లు ,ఏమి కనిపించడం లేదు ఇక్కడ.
అద్గదో ఆడ వెలుతురు కనపడుతుంది కదా, అదే మా ఇల్లు. ఎమ్మా నువ్వు బండి దిగువ? పాపొడితో పాటె వెళ్తావా ఏందీ ?
ఆన్ ఆన్ దిగుతాండలేబ్బా..
పాపోడా జాగ్రత్తగా ఇంటికి పో.. మళ్ళా ఈ తోవన రావద్దు అంటూ తలమీద ఆప్యాయంగా చేయి పెట్టింది. రవి కి స్పర్శ తగల్లేదు కానీఏదో విచిత్రమైన అనుభూతి కలిగింది .
ప్రతిమ గుర్తొచ్చి .. కార్ ఆక్సిలరేటర్ గట్టిగ తొక్కాడు. కార్ కొద్దిగా ముందుకెళ్లాక సైడ్ మిర్రర్స్ ఒకసారి చూసాడు.. ఇద్దరు కనిపించలేదు వారి తో పాటు ఆ వెలుగుతున్న దీపం కూడా.
చెప్పినట్టే ఆమడ దూరం ముందుకి వెళ్ళాక సిమెంటు రోడ్ కనపడింది, బండి రోడ్ ఎక్కగానే ఎవరో మంత్రించినట్టు హెడ్ లైట్స్ రెండు ఆన్ అయ్యాయి.
ఇంతలో ఎదో గలాటా జరిగినట్టు పెద్ద గుంపు ఒకటి కర్రలు, లాంతర్ల, ఛార్జింగ్ లైట్లు తీస్కొని వస్తుంది. వాళ్ళందరూ తన కార్ ని ఆపడానికి వస్తున్నట్టు అర్థమై బండి ని ఆపాడు రవి. భరద్వాజ్ బాబాయ్ కనపడగానే కారు దిగి ఎదురెళ్ళాడు.
రవిని చూడగానే.. ఎవరో నెత్తి మీద చల్లని నీళ్లు పోసినట్టు సంతోషంతొ కూచుండిపోయాడు భరద్వాజ్ బాబాయ్.
రవి బాబాయ్ దగ్గరికి వెళ్లి, ఏమి జరిగింది అందరు ఎందుకిలా వస్తున్నారు. ప్రతిమ ఏది అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు.
బాబాయ్, రవి ని గట్టిగ కౌగలించుకొని, ఇంటికి వెళ్లి తీరిగ్గా మాట్లడుకుందాం అని చెప్పి ఊరి జనాల వైపు తిరిగి రేప్పొద్దున మాట్లాడుకుందాం చాలా ఆలస్యం అయింది మీరందరు ఇళ్లకు వెళ్లిపోండి అని చెప్పాడు.
బాబాయ్ తో పటు పూజారి, ఆయన శిష్యులు కూడా ఇంటి దగ్గరికి వచ్చారు.
పూజారి గారు, నా మీద బాబాయ్ మీద ఒక బిందెడు నీళ్లు కుమ్మరించి, నిమ్మకాయల తొ దృష్టి తీసి ఇంట్లోకి వెళ్లామన్నారు. ఆయన శిష్యులు నలుగురిని ఇంటికి నాలుగు దిక్కులా కూచోబెట్టి తోలివేలుగు వచ్చేవరకు పంచాక్షరీ మంత్రాన్ని ఆపకుండా చదవని చెప్పి ఆయన గుడికి వెళ్లిపోయారు పూజలు చేయడానికి.
రవికి ఇదంతా చాలా విచిత్రంగా , ఏమి చెప్పాలో కూడా తెలీని స్థితిలో ఉన్నాడు.
ఇంట్లోకి వెళ్లి వెళ్ళగానే బాబాయ్ ని గట్టిగ అడిగాడు, బాబాయ్ ఏంటి ఇదంతా, ఏమి జరుగుతోంది ఇక్కడ ,ప్రతిమ ఎక్కడుంది?
బాబాయ్ ప్రశాంతంగా కూచొని, తనని కూడా కుచోమన్నాడు. ఇంతలో పిన్ని అక్కడికి వచ్చి ముందు ఈ గ్లాసు పాలు తాగు, బాబాయ్ అన్ని వివరంగా చెప్తారు.
పిన్ని తెచ్చిన పాలు తాగి, బాబాయ్ వైపుకి చూసాడు రవి.
రవి, ప్రతిమకు ఏమి కాలేదు.. నువ్వు కంగారపడకు అంటూ బాబాయ్ చెప్పడం మొదలు పెట్టాడు.. నువ్వు రావడానికి ఆలస్యం అవుతుండటం తో నేనే అమ్మాయి ని airport కి పంపించాను. ఈ విషయం నీకు చెప్దామని చాలాసార్లు ఫోన్ చేస్తున్నాం, కానీ నీ ఫోన్ సిగ్నల్ లేకపోవడం వల్లనేమో అసలు కనెక్ట్ అవ్వలేదు. వచ్చే దారిలో నువ్వు కనపడతావని మన వాళ్ళని పంపించాను. నువ్వు ఎక్కడ కూడా కనపడలేదు. నువ్వు దారి తప్పి ఎక్కడ రాణి బావి మలుపులోకి వెళ్తావో అని భయపడి రాముని పంపించాను. రాము రాణి బావి జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి నువ్వు కారు తిప్పేసి లోపలి వెళ్ళిపోయావు. రాము ఎంత పిలుస్తున్న నువ్వు చూడలేదు. ఇదంతా వెనక్కి తిరిగి వచ్చిన రాము మాకు చెప్పేసరికి మేము నీ మీద ఆశలు వదులుకున్నాం రవి.
రాణి బావి మలుపులోకి వెళ్లిన వాళ్ళు ఇప్పటిదాకా ఎవరు తిరిగి రాలేదు. అక్కడేమి జరుగుతుందో చెప్పే వాళ్ళు ఎవరు బ్రతికిలేరు.
పూజారి గారు చెప్పిన ప్రకారం, కొన్ని సంవత్సరాల కింద ఊరివాళ్ళు కలిసి భార్యాభర్తలని చిత్రహింసలు పెట్టి భర్తని భార్య ముందే కిరోసిన్ పోసి తగలబెట్టారు అతను కాలిపోతూ అక్కడున్న ఎర్రచందనం చెట్లను పట్టుకోవడం తో అక్కడి చెట్లన్నీ కాలిపోయాయి. తన కళ్ళ ముందే భర్త అగ్నికి ఆహుతవడం చూడలేక ఆమె రాణి బావి లోకి దూకి ఆత్మహత్య చేసుకుంది అంటారు. చనిపోయే సమయంలో ఆమె కడుపు తొ ఉందని కొంతమంది, మగ బిడ్డకి జన్మనిచ్చి చనిపోయిందని మరికొంతమంది, ఆడ బిడ్డకి జన్మనిచ్చి చనిపోయిందని ఇంకొంతమంది చెప్పారన్నారు.
చనిపోయిన ఆ భార్యాభర్తలిద్దరూ ఆత్మలై వాళ్ళ చావుకు కారణమైన ఊరి వాళ్ళని పగతో చంపుతున్నారని అప్పటి పూజారిగారు చాలా పూజలు చేసి వాళ్లిద్దరూ ఊర్లోకి రాకుండా అష్టదిగ్బంధనం చేసారంట. అప్పటినుండి ఊర్లో చావులు తగ్గిపోయినా , రాణి బావి జంక్షన్ లో వెళ్లే వాళ్ళు మాత్రం తిరిగి రావడం లేదు. అందుకనే ఆ జంక్షన్ నుంచి ఊర్లోకి రావడాన్ని ఆపేసి చుట్టూ అయినాకూడా జాండ్లవరం నుంచి రాకపోకలు చేస్తున్నారు.
ఇదంతా తెలిసిన కూడా మీ పిన్ని మాత్రం మొండిగా పూజారి గారి తొ గొడవపడి హోమాలు పూజలు చేయించింది. ఆ పూజలు హోమాలు ఫలితమేమో నువ్వు ప్రాణాలతొ తిరిగి వచ్చావు అంటూ బాబాయ్ చెప్పడం ఆపేసారు.
ఇంత జరుగుతుంటే ఆ బాటని ఎందుకని క్లోజ్ చేయలేదు? నాలాగా తెలియని వాళ్ళు అక్కడికి వెళ్తారు కదా బాబాయ్ అని రవి అడిగాడు .
ఎన్ని సార్లు కంచె కట్టిన ఉదయం అయ్యేసరికి అక్కడ ఏమి ఉండదు, ఒకసారి గోడ కడితే, ఇటుకలు రాళ్ళూ చెల్లాచెదురై ఉన్నాయంటే ఉదయం చూసే సరికి.
అవును రవి, అసలు ఆ మలుపు లోకి వెళ్ళాక ఏమి జరిగింది అంటూ అడిగాడు బాబాయ్.
బాబాయ్ మీరు చెప్పినట్లు నాకు అక్కడేమి వింతగా ఏమి కనిపించలేదు అని జరిగినదంతా వివరంగా చెప్పాడు బాబాయ్ పిన్నికి.
గడియారం 3 గంటలు కొట్టేసరికి, అందరు ఉదయాన్నే మాట్లాడుకుందాం అనుకుని పడుకోవడానికి వెళ్లిపోయారు.
మన వాణ్ణి వాళ్లిద్దరూ ఎందుకని ఏమి చేయలేదంటావ్ అని బాబాయ్ శైలజ పిన్ని తొ చెప్తుండటం విన్నాడు రవి.
ప్రతిమ తో అక్కడ జరిగిన అన్ని విషయాలు చెప్పిన తర్వాత మంచం మీద పడుకొని ఇమెయిల్ ఓపెన్ చేసాడు. రెండు రోజుల ముందే ప్రతిమ కార్ సర్వీసింగ్ చేయించినట్టు ఇన్వాయిస్ మెయిల్ ఉంది.
ఒక్కక్కటి గుర్తొస్తున్నాయి రవికి, కార్ లైట్స్ ఆఫ్ అవ్వడం.. హఠాత్తుగా తాటాకు చప్పుళ్ల శబ్దం ఆగిపోవడం.. ఉన్నట్టుండి వాతావరణం లో మార్పులు రావడం.. పెద్దమ్మ అలంకరించుకొని ఉండటం.. కాలిన ఎర్రచందనం వాసన రావడం.. వాళ్లిద్దరూ దిగిపోయాక దీపం కనిపించకపోవడం...
రాధమ్మ పేరు వినగానే వాళ్లిద్దరూ ఎందుకని గొణుక్కున్నారు.. అంతలోనే పెద్దాయన ఎందుకని సడన్ గా అరిచి ఎడమ వైపుకు తిప్పమ్మన్నాడు, నేరుగా వెళ్లుంటే ఏమి ఉండేది.. ఊరి వాళ్ళు అనుకున్నట్టు వాళ్లిద్దరూ నన్ను చంపేద్దాం అనుకుని ఉంటారా ..
వీటికి సమాధానాలు ఎలా తెలుస్తాయి ? ఎవరిని అడగాలి? అని ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయాడు రవి.
Khalil Ganiga
Just another programmer.. This blog expresses my views of various technologies and scenarios I have come across in realtime.
Keep watching this space for more updates.