Stories in the corners
మచా ఎక్కడరా ..
ఇంట్లోనే రా ..
ఫ్రీ గానే ఉన్నావా? కలుద్దామా ?
హ.. ఎక్కడ కలుద్దాం ?
మన రెగ్యులర్ స్పాటే ..
(10 నిమిషాల తర్వాతా .. సత్రం దగ్గర రోడ్ పక్కన ఉన్న గట్టు మీద కూచ్చోని .. బొరుగుల మిక్చర్, ఉడకబెట్టిన పచ్చి మిర్చి తింటు )
మచా యూట్యూబ్ vlogs చేద్దాం అనుకుంటున్నా..
హాన్ .. చేసి నువ్వే చూస్కుంటావా?
ఆపు బే .. నువ్వు నీ పెళ్ళిచూపుల డైలాగులు .. సీరియస్గా చెప్తున్నా.
సరే సరే .. ఇంతకీ కాన్సెప్ట్ ఏందీ ?
అదే రా, ఇంతకుముందు నీకు చెప్పగా.. ఫేస్ లేకుండా .. డిస్కషన్ ..
ఏందీ , పొలం లో బెంచి మీద కూచుని బ్యాక్ సైడ్ కెమెరా పెట్టి డిస్కషన్ చేసేది అదేనా ?
అవును ..!
ఇది వర్కౌట్ అవదు రాజా ..
ఎందుకని.. ఆరోజు కాన్సెప్ట్ బావుంది అన్నావుగా ..
అప్పుడంటే ఎదో అన్నానులే , కానీ ప్రాక్టీకల్గా ఆలోచించు.. పొలం లో మీ తాత పెడతాడా బెంచి ? మట్టి పెళ్లలు మీద tripod పెట్టడానికి అవుతద అసలు ? పొలం గాలికి tripod వూగుతుంటుంది.
hmm .. పొలం ,బెంచి అంటే సెట్ చేయొచ్చు కానీ tripod పార్ట్ నువ్వు చెప్పినట్టు వర్క్ అవ్వదు.
ఇంకో ఆప్షన్ ఉంది మచా..
చెప్పు..లేట్ ఎందుకు
పొట్టిపాడు రోడ్.. వేమన విగ్రహం దగ్గర ?
అపుడు బెంచి ఉండదు.. కింద మట్టిలో కూచోవాలి. ఫ్రేమింగ్ ప్రాబ్లెమ్. ముందు దానితో పోలిస్తే ఇది కొంచెం బెటర్.
hmm.. అవును కింద కూచోడం వద్దులే..
అరేయ్, ఇపుడు చెప్పే ఆప్షన్ నువ్వు నో చెప్పావ్ చూడు.. బెట్ కావాలంటే.
నీ బెట్ ల గురించి నాకు తెలుసు లే.. అదేదో తగలెట్టు ఆలోచిద్దాం అర్కటవేముల .. సమాధి .. ఊయల ..
ఆరేరేయ్ ఆగు.. ఏంటి ఆ సమాధి పక్కన ఉన్న ఉయ్యాలో కూచోని డిస్కషనా? బాబు.. నాకు ఇంకా కొద్దీ రోజుల బ్రతకాలని ఆశ ఉంది. చనిపోయిన ఆ పాపా లాగే నాక్కూడా కోరికలున్నాయి. నీ vlogs కోసం రేప్పొద్దున నేను భయంతో చచ్చిపోయా అనుకో, మా వాళ్ళు కూడా నా సమాధి ప్రక్కన అలానే చేస్తారు. వద్దురా నాయన వద్దు.
నీ బొంద ర నీ బొంద.. ఐన పాపి చిరాయువు అన్నార్లే .. నువ్వు అంత తొందరగా సావవు
నీ మొహం లే బే .. మా అమ్మకి ఇలా చేస్తున్నాం అని తెలిసింది అనుకో హార్ట్ఎటాక్ వస్తాదిరా.
అరేయ్.. మనం ఫేస్ చూపెట్టాం కదరా ఎలా తెలుస్తాది చేసేది నువ్వు నేను అని.. మనం ఎక్కడ మన నేమ్స్ వాడం.
hmm.. కాన్సెప్ట్ అయితే క్రేజీ గానే ఉంది .. సమాధి పక్కన ఉయ్యాల్లో కూచొని vlog చేయడం అంటే .. ఎవరు చేసి ఉండరు.. నాకు ఓకే .. డిస్కషన్ టాపిక్స్ ఏమైనా ఆలోచించావా?
స్పెసిఫిక్గా ఇది డిస్కస్ చేయాలి అని ఏమి ఆలోచించలేదు కానీ కొన్ని టాపిక్స్ నా మైండ్ లో చాల రోజులుగా బ్రుమ్ బ్రుమ్ అని తిరుగుతున్నాయి ..
కరెక్ట్ .. మన డిస్కషన్స్ ఒక కేటగిరికి ఫిక్స్ అవకూడదు.. సరే నువ్వు కంటిన్యూ చేయ్ ..
నా ఫస్ట్ టాపిక్ ..
అహంభావి అంకులు : ఇదొక చిత్రమైన జీవి.. మన బంధువర్గంలో ఎక్కువగా కనపడుతుంది. అపుడపుడు మన చుట్టుపక్కల కూడా. . రిటైర్మెంట్ స్టేజి దగ్గరలో ఉండి లైఫ్ లో ఇంకా సెటిల్ అవ్వని బ్యాచ్.. మెట్యూరిటీ కి, చాదస్తానికి మధ్యలో ఊగుతుంటారు. వయసురీత్యా నెరిసిన గడ్డం తో ,ఖద్దరు బట్టలు వేసుకొని సమాజం లో పెద్దమనుషుల్లాగా చెలామణి అవుతుంటారు. లేని పెద్దరికం తెచ్చుకొని మేకపోతు గాంభీర్యం చూపిస్తుంటారు. ప్రతి విషయం వీళ్ళకి చెప్పాలి.. చెప్పిన చెప్పకపోయినా మళ్లీ వీళ్ళు చేసేదేం ఉండదు అనుకో . సాయంత్రం అవ్వగానే ఇంకో అంకులు తో కలిసి పనికిరాని ఊసుపోని కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ టైం గడిపేస్తుంటారు. మనము ఆంటీలు ని మంధర లనుకుంటామ్ కానీ అసలైనే మంధరలు ఈ అంకుల్స్. మన ఖర్మకాలి వీళ్ళదగ్గరికి సలహాల కోసం వెళ్ళమా .. ఖర్మకాలింది కాబట్టే వెళ్తాము అది సెపరేట్ డిస్కషన్. .. సంకనాకిస్తారు. మన దరిద్రం ఏమంటే వీళ్ళ గురించి తెలిసికూడా మనం ఏమి చేయలేము ,అక్క,అత్త ,చిన్నమ్మ ,పెద్దమ్మ మొహాలని చూసి.
జీవితం లో సక్సెస్ అవడం చేతకాక ఆ ఫ్రస్ట్రేషన్ ని పక్కనోళ్ళ జీవితాలని నాశనం చేయడానికి చూస్తుంటారు ఈ త్యాగమూర్తులు.
నెక్స్ట్ టాపిక్ .. మాత్ర మాబుస్సేన్ : ప్రాస కోసం మాబుస్సేన్ పేరుని వాడుతున్న.. మనోడు చాలా ఫన్నీ అన్నమాట. పేరుకి డిగ్రీలు చేస్తాడు అది నాలుక తోముకోడానికి కూడా పనికిరాదు వీడిలాగే . స్వతహాగా ఏది ఆలోచించలేడు . ఆలోచించడానికి మెదడు అనే ఆర్గాన్ ఉంటుంది అని కూడా తెలిసి ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం. నాయనగారు సంపాదించింది స్వంత హక్కుల ఫీల్ అయి .. సారీ తప్పు నాదే.. నాయన సంపాదించింది సొంత హక్కే కదా. నేను చెప్పదల్చుకున్న పాయింట్ ఏంటి అంటే పక్కనోడు నానా కష్టాలు పడి సక్సెస్ అయ్యాడు అంటే ఒక మాత్ర వేస్కుకోని ఆడిలాగే సక్సెస్ అవ్వాలి అనుకోడం. బాడీ బిల్డ్ చేయాలంటే excercise చేయాలి, అది చేయకుండా బాడీ బిల్డ్ అవాలని మాత్రలు తీసుకుంటే ఉన్న మతి పాయె చంద్రమతి అవుతుంది.సక్సెస్ రాదు, సక్సెస్ అవ్వడం పక్కన పెడితే ఆ ఫ్రస్ట్రేషన్ ని వాడి మీద ఫాల్స్ అలిగేషన్ చేస్తాడు.
నెక్స్ట్ టాపిక్ ...
అరెయ్ ఆపు ర.. ఐన సమాధి పక్కన ఉయ్యాల్లో కూచొని హారర్ డిస్కషన్స్ పెట్టాలి కానీ హ్యూమన్ సైకాలజీ ఏంది రా..
హారర్ గురించి సమాధుల దగ్గర కాటికాపర్లు మనకన్నా బాగా డిస్కస్ చేస్తారు కదరా .. యూనిక్గా ఉండాలి కదా మన డిస్కషన్స్ సో.. పోను పోను అవి కూడా డిస్కస్ చేద్దాం లే.. చాల స్టోరీస్ ఉన్నాయ్ నా దగ్గర. ఐన మన డిస్కషన్స్ అన్ని ఒకే కేటగిరి ఉండవు..
ఇంకొక క్వశ్చన్ .. మన డిస్కషన్స్ ఎవడు చూస్తాడు సారీ వింటారు.. వినడం వల్ల ఉపయోగం ఏంటి?
బేసిగ్గా.. జనాలకి పక్కవాళ్ళు ఏమి మాట్లడుకుంటారో తెలుసుకోడానికి చాల ఆసక్తీ. బస్సుస్టాప్స్ లో పార్క్స్ లో ఫోన్లో మాట్లాడుతుంటే మనకు తెలీకుండానే వింటాం కదా .. ఉపయోగాలు గురించి అలోచించి చేస్తే tiktok సక్సెస్ అయ్యేదా? మనం ఎదో సొల్లు మాట్లాడుతాం దాన్నే రికార్డు చేసి అప్లోడ్ చేద్దాం.. అంతే
మచ్చ దోమలు సంపేస్తున్నాయా.. రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం రా.
(బైక్ స్టార్ట్ చేస్తుంటే..)
అవున్రా అప్పట్నుంచి ఏంటి తెగ టైపు చేస్తున్నావ్ ఫోన్ లో మనం మాట్లాడుకుంటున్నపుడు ..
అదా .. ఇపుడు మనిద్దరం మాట్లాడిందే. రేప్పొదున షూట్ అయ్యాక నచ్చకపోతే అట్లేఆస్ట్ టెక్స్ట్ రూపంలో అయినా ఉంటది కదా అని టైపు చేశా నోట్స్ లో..
ఎందుకు నచ్చదు అంటున్నవ్?
చాలామందికి వాలా ఓన్ వాయిస్ వినడం ఇష్టం ఉండదు కాబట్టి.. రికార్డు చేసాక నా వాయిస్ నచ్చకపోవచ్చు కాబట్టి..
రికార్డెడ్ వాయిస్ ఎందుకు నచ్చదు? జనరల్గ మనం మాట్లాడుతున్నపుడు వినే సౌండ్ కాంబినేషన్ అఫ్ air-conducted sound and bone-conducted sound .. రికార్డు చేసినపుడు ఈ సౌండ్ వేరీ అవుతుంది. చాలామందికి ఇది అసహజంగా ఉండి నచ్చదు.
వాకే .. అర్థమైంది. పద ఇంటికి
Khalil Ganiga
Just another programmer.. This blog expresses my views of various technologies and scenarios I have come across in realtime.
Keep watching this space for more updates.